Chiru Warns Ap CM




mega star responds on kapu ikya garjana meeting in tuni he wrote a public letter to Ap Cm chandrababu in this letter he says dthat all the incidents  in tuni is happen by the reckless duty of the ap government and Apcc cheif  Raghu veera also responds on it and  finelly chiru Gives Strong Warning to Ap Cm




కాపు గర్జన, తుని దుర్ఘటన పైన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తదితరులు సోమవారం నాడు స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వంపై చిరంజీవి ఘాటుగా స్పందించారు. ఆయన నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. కాపు గర్జనలో హింసాత్మక ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని చిరు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకత లేని పాలన వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు.ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాకుండా, విభజించి పాలించు అన్నట్లుగా వ్యవహారం ఉందని చంద్రబాబుకు రాసిన లేఖలో చిరంజీవి దుయ్యబట్టారు. ఎదురు దాడితో ప్రతిపక్షాల నోళ్లను మూయించలేరన్నారు. కాపులు, బీసీలు, మహిళలే కాదు... చివరకు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఉద్యమించబోతున్నారని చంద్రబాబును చిరంజీవి హెచ్చరించారు. ఇకనైనా హామీలు నెరవేర్చాలన్నారు




Comments

Popular posts from this blog

Deeksha Seth Latest Pics

Maya Mall Movie Bakrid Poster

Raja Cheyyi Veste Telugu Movie Review